Breaking

Saturday 25 February 2017

9 వ తరగతి జీవ శాస్త్రం-కణం



9 వ తరగతి జీవ శాస్త్రం –ముఖ్యమైన ప్రశ్నలు
1.వృక్ష కణం –జంతుకణం నకు గల బేధాలేవి?
2.కేంద్రక పూర్వ కణానికి ,మరియు నిజ కేంద్రక కణానికి గల తేడా లేవి?
3.ప్లాస్మా పొర యొక్క ప్రధాన విధులేవి ?
4.కనకవచం యొక్క ఆవశ్యకత ఏమి?
5.ప్రయోగశాలలో చెంప (బుగ్గ)కణము లో కేంద్రక పరిశీలనలు వ్రాయండి ?
6.కేంద్రకము యొక్క విధులేవి ?
7.నమూనా వృక్ష  మరియు నమూనా జంతు కణం పటం గీచి బాగాలు గుర్తించండి ?
8.కణములోని ముక్యమైన కణాంగాలేవి?
9.నునుపు అంతర్జీవ ద్రవ్య జాలానికి ,గరుకు అంతర్జీవ ద్రవ్య జాలానికి గల తేడా ఏమి?
10.రైబోసోముల ప్రధాన విధి ఏమి ?
11.గాల్జి సంక్లిష్టాలు కణాన్ని కి ఏ విధముగా ఉపయోగ పడుతుంది ?
12.విషపదార్థాలు ,మత్తు పదార్థాలను నిర్వీర్యం చేసే కనాంగం?
13.కణము లోని కొన్ని రకాల ఎంజైము లకు కణములోని అన్ని పదార్థాలను నాశనంచేసే శక్తి ఉన్నప్పటికి కణము నాశనము చెందక పోవడానికి కారణమేమి?
14.లైసోజోములను  స్వయం విచ్చితి సంచులు అని ఎందుకు అంటారు ?
15.ఉల్లి పొర కణాలలో మైటోఖాంద్రియా ను చూడడానికి ఏ రంజనాన్ని వాడాలి ?
16. మై టోఖాండ్రియా పటము గీచి భాగాలు గుర్తించండి ? నిర్మాణాన్ని వివరించండి ?
17. మై టోఖాండ్రియాను కణశక్త్యా గారాలు అని ఎందుకు అంటారు ?
18. హరితరేణువు పటము గీచి భాగాలు గుర్తించండి? ఉపయోగాన్ని వివరించండి ?
19.వృక్ష కణాలలో పెద్ద పెద్ద రిక్తికలు ఉండడానికి కారణాలను తెలపండి ?
20.జీవులయొక్క ప్రాధమిక ప్రమాణ మేది ?
21.అతి సూక్ష్మకణంఅతి పెద్దగా ఉండే జీవిలో విధులు నిర్వర్తించడాన్ని ఎలా అభినందిస్తావు ?.
22. కణ సిద్దాంతము లోని ముక్యమైన అంశాలు ఏవి ?
23.'”జీవుల మౌళిక ప్రమాణం కణం “ వివరంచండి ?
24 ప్లాస్మా పొర ప్రోటీన్లు మరియు లిపిడ్లు తో నిర్మితమై వుంటుంది
25.విచక్షణ స్తరం అని  ప్లాస్మా పొర త్వచాన్ని అంటారు .
26. మై టోఖాండ్రియా ను కణశక్త్యా గారాలు అని అంటారు.
27. కణములో జీర్ణ క్రియఎంజైములు కలిగిన కణాంగం లైసోజోములు .
28.కణాలను కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హూక్ .
29.కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్.
30. కణ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్ర వేత్తలు ష్లీడన్ మరియు ష్వాన్.
31. పై పటం లోని భాగాలను గుర్తించండి?

1 comment: