Breaking

Sunday, 19 February 2017

ప్రాజెక్ట్ -ఎడారి జీవులలో గల వివిధ అనుకూలనాలు-9వ తరగతి



ప్రాజెక్ట్ -ఎడారి  జీవులలో గల వివిధ అనుకూలనాలు 
జీవులలోని వివిధ అనుకూలనాలు  పై అవగాహన కల్పించడానికి ఈ ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది
ప్రాజెక్ట్ పేరు          -   ఎడారి  జీవులలో గల వివిధ అనుకూలనాలు 
తరగతి                       :-9వ తరగతి
విషయము:                  -ఆవరణ వ్యవస్థ లలో అనుకూలనాలు
పాఠశాల                           అర్.సి.యం.ఉన్నత పాఠశాల –రేణిగుంట-చిత్తూరు జిల్లా 
నిర్వహణ సమయం       :-3రోజులు
పరికరాలు/మూలం        -9వ తరగతి జీవశాస్త్రం, ఇంటర్మీడియట్ జంతు శాస్త్రం , అంతర్జాలము
ప్రాజెక్ట్ వివరాలు ప్రకృతి యొక్క మూల ప్రమాణం ఆవరవ్యవస్థ  అని తెలుపుతూ, 1935 వ సంవత్సరం లో ఎ.జి.టాన్సిలే ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటి సారిగా ఉపయోగించాడు.ఆవరణలో జీవ నిర్జీవ ,వాతావరణ కారకాలు  ఒక దానినొకటి  తీవ్రముగా  ప్రభావితము చేసుకొంటాయి.జీవులు వాటి అవసరాలకు అనుగుణముగా పరిసరాలను ప్రభావితము చేస్తాయి .నిర్జీవ అంశాలు కూడా జీవుల జీవన విధానం పై ప్రభావితంచేశాయి.ఏ జీవి కూడా తనకు తానుగా జీవించలేదు.ఆవరణ వ్యవస్థ  పరిసరలాలలోని   అంతర సంబందము లో, ఒక భాగము మాత్రమే.అంటే  ఆవరణ వ్యవస్థ  లో  అనేక ఆవాసాలు ఉంటాయి. ఉదాహరణకు గడ్డి భూమి ఆవరణ  వ్యవస్థ ,అడవి ఆవరణ  వ్యవస్థ,ఎడారి ఆవరణ  వ్యవస్థ,మంచినీటి ఆవరణ  వ్యవస్థ, ఉప్పునీటి ఆవరణ  వ్యవస్థ  మొదలైనవి.
వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తర్వాత వాటికి లేదా ఆ పరిస్థితులకు తగినట్టుగా అభివృద్ధి చెందుతాయి. వాటినే జీవ అనుకూల తలు లేదా జీవ అనుకూలనాలు అంటారు. అనుకూలతలు ఒక జనాభాలో కనపడే సాధారణ లక్షణాలు. ఎందుకంటే ఇవి జీవులు మనుగడ సాగించడంలో సహకరిస్తాయి..వీటినే అనుకూలనాలు అంటారు.
లక్ష్యాలు:-ఎడారి , జీవులలో గల అనుకూలనాలను గుర్తించుట ,వివరించుట ,విశ్లేషించుట మరియు వాటి కారణాలను తెలియజేయుట .
ఎడారి అనగా ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.
అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం.[1][2][3][4]. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.

ఒయాసిస్సు:-ఎడారి ప్రాంతంలో మామూలుగా నీరు గానీ వృక్ష సంపద ఉండదు. కానీ ఎడారిలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో నీరు మరియు వృక్ష సంపద లభ్యమౌతాయి. ఇటువంటి ప్రాంతాల్నే ఒయాసిస్సులు అంటారు. ఇవి ఎక్కువగా నీటి బుగ్గలు ఉన్న ప్రదేశాల చుట్టూ తయారవుతాయి. ఎడారిలో ఇవి జంతువులకు, మానవులకు ముఖ్యమైన జలాధారాలు. ఎడారి చుట్టుప్రక్కల నాగరికత నిలబడడానికి, ఎడారులగుండా ప్రయాణాలకు ఒయాసిస్‌లు చాలా ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నాయి. ఒయాసిస్‌ల ప్రాముఖ్యతఅనాదిగా ప్రపంచంలో వాణిజ్య ప్రయాణ మార్గాలలో ఒయాసిస్సులు ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి. వర్తక బిడారులు (Caravans) ఒయాసిస్సులున్న మార్గాలవెంట ప్రయాణించేవారు.

ఒయాసిస్‌లు ఏర్పడే విధం

ఒయాసిస్ అంటే ఎడారిలో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతం. ఎడారిలో కూడా అప్పుడప్పుడూ వర్షం పడుతుంది. ఈ వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి క్రింద, అనగా రాతి పొర క్రింద, ఊటగా ఉంటుంది. ఎడారిలో ఇసుక రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్లా చెదురవుతాయి. అలా కొండల్లాంటి ఇసుక మేటలు ఒక చోటినుండి మరొక చోటికి కదులుతుంటాయి.. ఇలా ఇసుక మేటలు కదిలే ప్రక్రియలో కొన్ని ప్రాంతాలలో ఒరవడికి అక్కడి ఇసుక కొట్టుకుపోయి పల్లపు ప్రదేశం ఏర్పడుతుంది. ఆ పల్లపు భూతలం దాదాపు భూగర్భ జలం(water table) దగ్గరగా వస్తుంది. అలాంటిచోట పడిన విత్తనాలు మొలకెత్తి, వాటి వేళ్ళు క్రింద ఉన్న తడి ప్రదేశంలోకి విస్తరిస్తాయి. అక్కడ నీటి ఊటలు పైకి వచ్చి ఒయాసిస్‌గా ఏర్పడతాయి.

ఒయాసిస్సులలో నివసించే ప్రజలు అక్కడ ఉండే అంగుళం స్థలాన్ని కూడా వదలకుండా వాడుకుంటారు. నీళ్ళను చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఖర్జూరం, figs, olives, and apricots మొదలైన పంటలను పెంచడానికి అనువుగా భూమిని సారవంతం చేయాల్సి ఉంటుంది. ఖర్జూరపు చెట్లు ఒయాసిస్సులో పెరిగే చెట్లలో అతి ప్రధానమైనవి..
ఎడారి మొక్కలలోని అనుకూలనాలు
 ఎడారి మొక్కలు:- ఈ మొక్కలు నీరు లోపించిన జలాభావ పరిస్థితులలో పెరుగుతాయి. వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి
1 అల్ప కాలిక మొక్కలు
2.
రసభరితమైన మొక్కలు
                              రసభరిత కాండాలు గల మొక్కలు : ఒపన్షియా, యుఫర్బియా తిరుకల్లై
రసభరిత పత్రాలు గల మొక్కలు : బ్రయోఫిల్లమ్, అలో, అగేవ్
రసభరిత వేళ్ళు గల మొక్కలు : ఆస్పరాగస్, సీబా పార్విఫ్లోరా
3. రసభరితం కాని మొక్కలు
అల్పకాలిక మొక్కలు ఏకవార్షికాలు: ఇవి శుష్క ప్రాంతాలలో పెరుగు తాయి. అతి తక్కువ కాలంలో తమ జీవిత చరిత్రను ముగించు కొంటాయి.ఉదా: ట్రిబ్యులస్‌ (పల్లేరు)
రసభరితమైన మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఆ నీటిని వివిధ భాగాలలో జిగురు (మ్యూసిలేజ్‌) రూపంలో నిల్వచేస్తాయి. దీని ఫలితంగా మొక్క భాగాలు- వేరు (ఆస్పరాగస్‌), పత్రం (అగేవ్‌), కాండం (ఒపన్షియా) రసభరితంగా ఉంటాయి.
రసభరితం కాని మొక్కలు దీర్ఘకాలిక జలాభావ పరిస్థితుల్ని తట్టుకోగల బహువార్షికాలు.
ఉదా: కాజురైనా (సరుగుడు)
కలబంద మొక్కలలో పత్రాలు కంటకాలుగా మార్పు చెందటం వల్ల, భాష్పోత్సేకం ద్వారా నీరు వృథా కాకుండా చూస్తాయి. కాండంలోని కణజాలాలు నీటిని నిలువ చేసి రసభరితంగా ఉంటాయి. ఈ మార్పు ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినపుడు మొక్కలు వాటిని తట్టుకొని జీవించగలుగుతాయి.
మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కిత్తనార అనే ఎడారి మొక్కలు పొలాల గట్ల మీద కంచె మాదిరిగా పెంచుతారు.
గులకరాళ్ల మొక్కలలో ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటిని నిల్వచేస్తాయి. వాస్తవానికి ప్రతీ గులకరాయి ఒక పత్రం సూర్యరశ్మి పత్రంలోకి ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉంటుంది. అది రాయిలా కనబడడం వలన జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలేస్తాయి.
                               
 ఎడారి జంతువు లలోని అనుకూలనాలు
ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు ఇందులో ముఖ్యమైనవి.
ఒంటెలు ప్రత్యేకతలు:- ఒంటెలో మోపురం కొవ్వును తర్వాత అవసరాల కోసం నిల్వచేస్తుంది. పొడవైన కనుబొమ్మలు కంటిని ఇసుక, దుమ్ము నుండి రక్షిస్తాయి. నాసికారంధ్రాలు స్వచ్ఛందంగా మూసుకోవడం వలన వీచే ఇసుక నుండి రక్షణ పొందుతుంది. పొడవైన కాళ్ళు వేడెక్కిన ఇసుక నేలనుండి శరీరాన్ని దూరంగా ఉంచుతుంది.
  • ఒంటెల శరీరము మందముగా ఉండి ఎడారి జీవనమునకు సహకరించును.
  • వీటి పాదాల క్రింది భాగాలు పెద్దగా దిళ్ళవలె ఉండి ఇసుకలో పాదం దిగబడకుండా వేగంగా ప్రయాణించుటకు వీలవును.
  • ఎడారులలో ఎక్కువ దూరము ప్రయాణించు ఈ జీవులు తమ కడుపులో ఎక్కువ నీటిని నిలువ చేసుకొని కొద్దిరోజుల వరకూ నీటిని తీసుకోకుండా జీవించగలవు.
  • ఒంటెలు నీళ్లు తాగకుండా రెండు నెలల వరకూ ఉండగలవు. అయితే నీరు కనుక దొరికితే ఇవి ఒక్కసారి దాదాపు ఏడు లీటర్ల నీటిని తాగేస్తాయి!
  • ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే తప్ప ఒంటెలకు చెమట పట్టదు.
  • ఒంటె మూపురంలో అత్యధిక మోతాదులో కొవ్వు ఉంటుంది. ఇది బయటి వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది!
  • ఒంటెను వేటాడటం ఏ మృగానికైనా కష్టమే. ఎందుకంటే, ఒంటె కాళ్లు చాలా బలంగా ఉంటాయి. పైగా అది నాలుగు కాళ్లతోనూ తన్నగలదు!
  • ఇసుక తుఫాన్ల సమయంలో కూడా ఒంటెలు స్పష్టంగా చూడగలుగుతాయి. ఎందుకంటే వాటి కనురెప్పలు రెండు పొరలుగా ఉంటాయి. అవి కళ్లను కాపాడతాయి. ముక్కు రంధ్రాల నిర్మాణం కూడా అవసరాన్ని బట్టి మూసుకోగలిగేట్లుగా ఉంటుంది కాబట్టి వాటికి ఏ ఇబ్బందీ ఉండదు!
  • శత్రువులు దాడి చేసినప్పుడు ఒంటెలు మొదట చేసే పని... ఉమ్మడం! ఆకుపచ్చ రంగులో ఉండే చిక్కటి ద్రవాన్ని ఊస్తాయివి. ఆ జిగురును వదిలించుకోవడం, వాసనను భరించడం చాలా కష్టం
  •  
సైడ్‌ వైండర్‌ యాడర్‌ స్నేక్‌: ఈ పాము ప్రక్కకు పాకుతూ కదులుతుంది. దీని వలన శరీరంలోని కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుక తలాన్ని ఒత్తుతుంది. ఈ రకమైన కదలిక శరీరాన్ని చల్లగా ఉంచటంలో తోడ్పడుతుంది.
'
గోల్డెన్‌మోల్‌' అనే జంతువు ఎండ వేడిమి నుండి తప్పించు కోవడానికి ఇసుకలో దూకి ఈదుతున్నట్లు కదులు తుంది. ఇది అన్ని అవసరాలు నేలలోపలే తీర్చుకోవడం వలన చాలా అరుదుగా నేల బయటికి వస్తుంది.
ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివసించే ''క్యాంగ్రూ ఎలుక'' జీవితమంతా నీరు తాగకుండా జీవిస్తుంది. వీటి శరీరం జీర్ణక్రియా క్రమంలో కొంత నీటిని తయారుచేస్తుంది.
సౌండ్‌ గ్రౌజ్‌ అనే ఎడారి పక్షి నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్‌ను చేరుకుంటుంది. తన కడుపులోని ''క్రాప్‌'' అనే భాగంలో నీటిని నింపుకుని వచ్చి గూటిలోని పిల్లలకు తాగిస్తుంది.
ఫెన్నిస్‌ ఫాక్స్‌ - బొచ్చుతో కప్పి ఉన్న పాదాలుండే ఎడారి నక్క వేడెక్కిన ఇసుకపై నడవటానికి వీలుగా అనుకూలత పొంది ఉంటుంది. ఇది అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోతుంది.
సౌండ్‌ డైవింగ్‌ లిజార్డ్‌: ఎడారి ఇసుక బాగా వేడెక్కినప్పుడు తన కాళ్ళను గాలిలో పైకెత్తుతూ నడుస్తూ చల్లగా ఉంచు కుంటుంది.
పరిశిలనలు:-వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తర్వాత వాటికి లేదా ఆ పరిస్థితులకు తగినట్టుగా అభివృద్ధి చెందుతాయి. వాటినే జీవ అనుకూల తలు లేదా జీవ అనుకూలనాలు అంటారు. ఈ అనుకూలనాలు జీవులు మనుగడ సాగించడంలో సహకరిస్తాయి.జీవులలో అనుకూలనాలు లేనట్లైతే అవి మనుగడ సాగించలేవు.
ప్రాజెక్ట్ ఫలితం:-విద్యార్థులు తమ పరిసరాలలోని జీవులలోని అనుకూలనాల పై అవగాహన పొందుదురు. జీవులలోని అనుకూలనాలను వాటి ఆవశ్యకతను వివరించెదరు.
 

   
      






















                                       

No comments:

Post a Comment