Breaking

Sunday, 19 February 2017

ప్రయోగశాల కృత్యము- పుష్పాలలోని భాగాలను ఛేదించి పరిశీలించుట -7 వ తరగతి



                                     ప్రయోగశాల కృత్యము- 7 వ తరగతి
ఉద్దేశ్యము   :-పుష్పాలలోని భాగాలను ఛేదించి పరిశీలించుట మరియు వివరించుట.
కావలసినవి :-ఉమ్మెత్త ,మందార,బొప్పాయి పుష్పాలు ,బ్లేడ్ మైక్రోస్కోప్,స్లైడ్స్ మరియు అట్టముక్క.        
ప్రయోగ విధానం :-మొదటగా మా సైన్సు ఉపాధ్యాయులు పుష్పాలను గూర్చి పరిచయం చేశారు.తరువాత ఉమ్మెత పుష్పములోని ప్రతి భాగాన్నిచూపుతూ బొమ్మలు గీచి వివరించారు .అదే విధముగా పిల్లల్ని కూడాఉమ్మెత్త పుష్పాన్ని తీసుకొని అందులోని ప్రతి భాగాన్ని గుర్తించమని ,ఒకోక్కభాగాన్ని చూపమన్నారు.అదే విధముగా మందార పుష్పములోని భాగాలను గుర్తించమని తెలిపారు.పరాగాకో శములోని పరాగ రేణువులను .అండాశయములోని అండాలను మైక్రోస్కోప్ ద్వారా పిల్లలకు చూపారు . చివరగా బొప్పాయి పుష్పాలను జాగ్రత్తగా పరిశీలించమని ,మిగిలిన పుష్పాలకు గల బేధాన్ని గుర్తించమని తెలిపారు.
                                         

పరిశీలనలు:-మొక్కలలో లైంగిక భాగము పుష్పం .ఉమ్మెత్త పుష్పములో ప్రధానముగా నాలుగు భాగాలు ఉంటాయని అవి రక్షక పత్రావళి,ఆకర్షణ పత్రావళి,కేశరావళి,అండకోశము అని గుర్తించాము
రక్షక పత్రావళి:-పుష్పములోని ప్రధాన భాగాలైన కేశరావళి,అండకోశము ను మొగ్గ దశలో కప్పి కాపాడుతాయని గుర్తించాము.
 ఆకర్షణ పత్రావళి:-పరాగసంపర్కం (పరాగరేణువులు కీలాగ్రమును చేరడం ) జరగడానికి  వాహకాలను ఆకర్షిస్తాయని అందుకు గాను అవి ఆకర్షణీయంగా,సువాసనను కలిగి ఉంటాయని గుర్తించాము.
కేశరావళి :-పుష్పములోని మగ అవయవాలను కేశరావళి అని, ఇందులో కేసరదండం,పరాగకోశం అనే భాగాలు ఉంటాయని,పరాగకోశం పరాగారేణువులను ఉత్పత్తి చేస్తాయని ,వీటిని పురుషబీజకణాలు అంటారు.వీటిని వాహకాలు గ్రహించి కీలాగ్రానికి చేరుస్తాయని  గుర్తించాము.
అండకోశము:- పుష్పములోని స్త్రీ అవయవాలను  అండకోశము అని ,ఇందులో అండాశయం ,కీలము ,కీలాగ్రం అనేభాగాలు ఉంటాయని,అండాశయములో ప్రధానముగా అండాలుంటాయి.ఈఅండాలతో పరాగరేణువులు కలిసి విత్తనాలుగా మారుతాయని,అండాశయం కాయగా మారుతుందని గుర్తించాము.
నిర్థారణ :- పుష్పాలు మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగమని తెలుసుకొన్నాము .పుష్పాలనుంచే ఫలాలు ఏర్పడతాయని తెలుసుకొన్నాము. బొప్పాయి పుష్పాలను పరిశీలించిన  తరువాత  వాటిలో కొన్ని  స్త్రీ పుష్పాలు ,కొన్ని పురుష పుష్పాలు వున్నాయని  అని గుర్తించాము .దీనిని బట్టి మొక్కలలో కొన్ని ద్విలింగాశ్రయులు (కేశరావళి, అండకోశము) అని మరికొన్ని మొక్కలు ఏక లింగాశ్రయులు (కేశరావళిలేదాఅండకోశము) అని  తెలుసుకొన్నాము.మందార పుష్పాలను పరిశీలించి,వాటిలోని భాగాలను గుర్తించాము.
 

Prepared by M.Giribabu,R.C.M.HIGH SCHOOL-RENIGUNTA.

1 comment: