Breaking

Sunday 19 February 2017

అవయవదానము పై అవగాహన ప్రాజెక్ట్



ప్రాజెక్ట్ రిపోర్ట్
అవయవదానము పై అవగాహన కల్పించడానికి ఈ ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది
ప్రాజెక్ట్ పేరు          -          అవయవదానము తో అమరులు గా జీవించడం
తరగతి                       :-10వ తరగతి
విషయము:                  -జీవశాస్త్రం –విసర్జన వ్యవస్థ
పాఠశాల             అర్.సి.యం.ఉన్నత పాఠశాల –రేణిగుంట-చిత్తూరు జిల్లా 
నిర్వహణ సమయం       :-3రోజులు
పరికరాలు/మూలం        -వార్తా పత్రికలు,స్థానిక డాక్టర్- అంతర్జాలము
ప్రాజెక్ట్ వివరాలు
·        వైద్య శాస్త్రములో చోటు చేసుకుంటున్న పెనుమార్పులు మానవ మరణాన్ని శాసించే స్థాయికి వస్తుంది అనడములో సందేహంలేదనిపిస్తుంది .బ్రెయిన్ డెడ్ తో మరణించిన వ్యక్తుల  యొక్క  అవయవాలను  ,కొన్ని ముక్యమైన అవయాల పనితీరు పాడవడం కారణముగా మరణముతో పోరాడుతున్న వారికి అమర్చడం వల్ల వారిని జీవింప చేయడమే అవయదానము యొక్క ప్రధాన లక్ష్యం .ఎవరు ఎవరికీ ఎలాంటి పరిస్థితులలో అవయవాలను  దానము చేయవచ్చునో తెలుసుకొందురు.
 పరిశీలనలు
·        బ్రెయిన్ డెడ్ ను ఎవరు నిర్థారిస్తారు ? ఎవరు దానం చేయవచ్చు?ఏ ఏ అవయవాలను దానం  చేయవచ్చు, ఏ ఏ అవయవాలను ఎంతకాలము లో రోగికి అమర్చాలి?
ప్రాజెక్ట్ ఫలితం
·                 విద్యార్థులు ద్వారా స్థానికముగా ప్రజలలో అవయవదానము పై అవగాహనపొందుదురు అవయదానముయొక్క ఆవశ్యకతను వివరించెదరు.అవయవదానం ఎవరు ఎవరికీ ఎలాంటి పరిస్థితులలో అవయవాలను దానము చేయవచ్చునో తెలుసుకొందురు .ఏ ఏ అవయవాలు దానము చేయవచ్చునో తెలుసుకొందురు
గ్రూప్  లోని సభ్యుల వివరాలు  మరియు పని విభజన
క్ర.సం
సభ్యుని పేరు
అప్పగించిన పని








  సమర్పించిన తేది :                               సంతకాలు :

10వ తరగతి – అవయవదానము
(మనిషికి మరణము తరువాత కూడా ప్రాణం ఉంటుంది అదే అవయవదానం )
ప్రపంచ అవయవదాన దినోత్సవంను ప్రతి సంవత్సరం  ఆగష్టు 6న జరుపుకుంటారు
ప్రాజెక్ట్ పేరు   :- అవయవదానము తో అమరులు గా జీవించడం
ఉద్దేశం  :       - అవయవదానము గూర్చి   తెలుసుకొనుట మరియు వివరించుట
పరికల్పన :-     అవయవదానము ఎవరైనా చేయ వచ్చునా?
మూలం   :- వార్తాపత్రికలు ,స్థానిక డాక్టర్, అంతర్జాలము.

ప్రణాళిక :- అవయవదానము ఎవరు ఎవరికీ ఎలాంటి పరిస్థితులలో అవయవాలను దానము చేయవచ్చునో తెలుసుకొనుట . అవయవాలు దానము చేయవచ్చునో తెలుసుకొనుట.

బ్రెయిన్ డెడ్  అంటే ఏమిటి? బ్రెయిన్ డెడ్ ను ఎవరు నిర్ధారిస్తారు, బ్రెయిన్ డెడ్ కు కారణాలు ఏమిటి ?

అవయవదానం అంటే ఏమిటి?

వివిధ అనారోగ్యకారణాల వల్ల శరీరములోని ప్రధాన అవయవాలైన గుండె ,ఊపిరితిత్తులు ,మూత్రపిండాలు,లివర్ ,నేత్రాలు కార్నియా ,పాంక్రియాస్,చిన్న ప్రేవులు ,బోనే మారో ,చర్మం  వంటి అవయవాలు చెడిపోయి పనిచేయని సమయములో వారు జీవించడానికి వారికి తప్పని సరిగా అవయవాలు మార్పిడి చేయాల్సి ఉంది .ఆలాంటి వారికి వివిధ వ్యక్తుల ద్వారా అవయవాలను ఇచ్చి  వారి ప్రాణాలను కాపాడడాన్నిఅవయవదానం అందురు.

అవయవదానము ఎవరు చేయాలి?

·        .కుటుంబసభ్యులలో ఎవరికైన అవయవాలు పాడయి  ఉన్న, వారికి ,వారి కుటుంబసభ్యులు తమ అవయాలను అందించడం

·        సన్నిహితులకు అవయదానం (ప్రభుత్వంలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అనుమతి తీసుకుని దానం చేయాలి ) 

·        బ్రెయిన్ డెడ్ (కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి )ఒక వ్యక్తి శరీరము నుండి నుంచి  అవయవాలు తీసుకొని ఇతరులకు ప్రాణదానం చేయ వచ్చును.

·        What are the different types of organ donation?

1. Live Related Donation: Living donation takes place when a living person donates an organ (or part of an organ) for transplantation to another person. The living donor can be a family member, such as a parent, child, brother or sister, grandparent or grandchild (living related donation).

2. Live Unrelated Donation: Living donation can also come from someone who is emotionally related to the recipient, such as a good friend, a relative, a neighbour or an in-law (living unrelated donation).

3. DeceasedCadaver Organ Donation: The patient has to register in a hospital that does transplants. The patient will be put on a wait list.As and when the organ from an appropriate deceased donor (brain death) is available, the patient will be intimated.

·         

.  

అవయవదానము ఎవరు చేయకూడదు ?

HIV,క్యాన్సర్ ,వైరస్ ,బాక్టీరియా సంబంద వ్యాదులతో బాధ పడేవారు ..

దీర్ఘకాలికంగా శరీరం చచ్చుబడిన వారు ,

కారుణ్య మరణాల్లో అవయదానం చేయకూడదు.

సరోగసి(surrogacy)ద్వార పుట్టిన పిల్లలు అవయవదానం చేయడానికి వీలులేదు .  

·           బ్రెయిన్ డెడ్  అంటే ఏమిటి? )మెదడులోని కీలక అంశముల మృతి)

 

·        బ్రెయిన్ డెడ్ చరిత్ర :- 1959లో మొదటిసారిగా ఇద్దరు ఫ్రెంచ్ డాక్టర్లు ఇంటేన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ మీద కోమా స్థితికి బిన్నముగా ఉన్న వ్యక్తిని మొదటగా గుర్తించడము జరిగింది.

·        1968లో హర్ద్వార్డు వైద్య కళాశాల కమిటీ వారు మెదడుకు సంబందించిన ప్రతిస్పందనలు, సహజ సిద్దమైన శ్వాసక్రియలు ఆగినప్పుడు ఆ వ్యక్తిని  బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు.

(An Ad Hoc Committee of Harvard Medical School defined brain death as irreversible coma with the patient being totally unreceptive and unresponsive with absence of all cranial reflexes and no spontaneous respiratory efforts during a 3 minutes period of disconnection from the ventilator.)

·        ఇండియా లో 1994 లో మానవ అవయవదానం చట్టము ప్రకారం రాష్ట్రాలలో ఏర్పాటుచేసిన రెగులేటరి అథారిటి అధికారములో అవయదాన ప్రక్రియ పరిశీలించి,వారి ఆధ్వర్యములో జరుగును .

(India recognises brain death in the Transplantation of Human Organs Act of 1994. Regulatory authorities in each state are empowered to look into the whole process of organ donation for both live related (or unrelated) and cadaver organ donation and transplantation)


బ్రెయిన్ డెడ్ ఎపుడు ఏర్పడుతుంది ?
·        మాములుగా గుండె ఆగిపోతే జీవులు మరణిస్తాయి .అది సహజం ,మరి ఒకొక్కసారి అనుకోని విధంగా మెదడుకు ఆక్సిజెన్ అందక పోవడం వల్ల మెదడు పనిచేయదు  తరువాత మస్తిష్క మూలం మరణిస్తుంది .దీనినే బ్రెయిన్ డెడ్ అంటారు.
నలుగురు  డాక్టర్ల బృందం చే బ్రెయిన్ డెడ్ ను నిర్ధారిస్తారు

రోగి క్రింది లక్షణాలను కలిగి వున్నపుడే రోగిని  బ్రెయిన్ డెడ్ గా నిర్థారిస్తారు 

·        క్ష్యోభ్యత ధర్మం రోగికి వుండదు . (చర్యకు ప్రతిచర్య )

·        అవయలన్ని చల్లగా ఉంటుంది

·        కనుపాపలు ప్రతిస్పందించవు

·        శుక్లపఠలము స్పందించదు

·        మెదడుకు సంబందించిన ప్రతిస్పందనలు వుండదు .

·        సహజ సిద్దమైన శ్వాసక్రియలు వుండదు

 

 


·         According to the provisions of the Transplantation of Human Organs Act, known as THOA, the protocol for declaration of brain death is as follows :
·         Any organ donation process must involve the following steps before the actual transplant can occur:
·         Panel of 4 doctors need to declare the brain death twice in a span of 6 hours. 2 of these doctors must be from a panel approved by the government. This panel includes:
·         i. Registered Medical Practitioner in charge of the Hospital where brain stem death has occurred.
ii. Registered Medical Practitioner nominated from the panel of names sent by the hospitals and approved by the Appropriate Authority.
iii. Neurologist/Neuro-Surgeon
·               iv. Registered medical practitioner treating the aforesaid deceased person.
·               The same is   recorded on Form 10 of the THO Act 2014. 

 

బ్రెయిన్ డెడ్ కు కారణాలు ఏమిటి ?                        



మెదడుకు బలమైన గాయాలు కలగడం వల్ల


మెదడు వాపు కారణం వల్ల 

 

తలలో రక్త స్రావం జరగడం వల్ల

 

తలకు బలమైన గాయాలు కలగడం వల్ల

ఏ ఏ అవయవాలు ఎవరెవరు దానం చేయవచ్చును?

వయస్సు :- 18 సంవత్సరాలు నిండి న వారు అవయవాలను  దానము చేయవచ్చ్చు.( ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు,గుండె ఆగి మరణించినవారికి వయస్సుతో పని లేదు )

 

 

 ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు

·         బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ వెంటి లెటర్ సహాయముతో ఆ వ్యక్తి గుండె కు  ఆక్సిజెన్  ఇవ్వడం వల్ల అవయవాలన్నీ జీవముతోనే వుంటాయి .ఇలాంటి వ్యక్తి  యొక్క రక్త సంబంధీకు అనుమతి తీసుకొని ఆ  వ్యక్తి శరీరము నుండి   అవయవాలు తీసుకొని ఇతరులకు ప్రాణదానం చేయ వచ్చును. వెంటి లెటర్ ను  తీసిన వెంటనే ఈ అవయదానం మొదలవుతుంది .

·        ఊపిరితిత్తులు,(4-6hours )గుండె (4-6 hours) కాలేయం (24 hours ) క్లోమం(24 hours),మూత్రపిండాలు (72hours ),కార్నియా (14 days ),ఎముకలు (5 years), చర్మం (5 years),

 గుండె కవాటాలు (10 years) ,బోనే మారో, నిర్దేశించిన సమయములోపల అవయవ మార్పిడి   జరగాలి అపుడే ఆ అవయవాలు పనిచేస్తాయి.

 

గుండె ఆగి మరణించినవారు

·       24 గంటలలోపు కణజాలాలయిన ఎముకలు ,చర్మం,హృదయ కవాటాలు మరియు కార్నియా దానం చేయ వచ్చును .

రక్త సంబంధికులు మరియు ఆత్మీయులు  :-  వీరు తమ మూత్రపిండంను ,ఊపిరితిత్తులలోని శ్వాస కోశం ను ,కాలేయము, క్లోమం, ప్రేవులలో  కొంత భాగంను దానం చేయవచ్చును .

గమనిక :-ఒక వేళ అవయదానం స్వీకరించిన వ్యక్తి మరణిస్తే (ఉదాహరణకు కార్నియా )ఆ కార్నియా ను వేరే వ్యక్తి కి అమర్చవచ్చును. అంటే కార్నియాకు మరణమే లేదు .మనం మరణించిన మనకండ్లు ఎప్పటికి ప్రపంచాన్నిచూస్తునే వుంటాయి.  

             (వైద్య శాస్త్రం మనకందించిన అపురూప కానుక)

ముగింపు :-ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం  ఈ అవయదానం .దీనినిగూర్చి తెలుసుకోవాలి ,ఇతరులకు తెలియచేయాలి ,ముక్యముగా యువత ,విద్యావంతులు మతాధికారులు చైతన్యం పొందాలి .

మీపేరు రిజిస్టర్ చేసుకోవాలంటే సంప్రదించవలసిన చిరునామా

జీవన్ దాస్

www.jeevanadan.gov.in  వెబ్ సైట్ లో  అవయవాళ్ళు పాడయిన వారు రిజిస్టర్ చేసుకోవాలి .

 

 

No comments:

Post a Comment